

పాలు, గుడ్లు పిల్లల పెరుగుదలకు అత్యవసరమైన సంపూర్ణాహారంగా చాలా కాలంగా భావించబడుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు రోజూ గుడ్లు, పాలు పిల్లలకు అందిస్తున్నారు. గుడ్డులో ప్రోటీన్ సమృద్ధిగా ఉండగా, పాలలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉన్నాయి. అయితే, ఈ రెండు మాత్రమే సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు, చిన్న వయసులోనే యుక్తవయసు, రుతుక్రమ సమస్యలు, మొటిమలు, పీసీఓడీ వంటి హార్మోన్ లోపాలు పెరుగుతున్నాయి. అబ్బాయిలలో కూడా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కారణం, పెరుగుదల దశలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఇతర పోషకాలు సరిపడా అందకపోవడమేనని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ లోపాలను తగ్గించేందుకు పాలు, గుడ్లతో పాటు ఇతర పోషకాహారాలను కూడా ఆహారంలో చేర్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొలకలు, వేరుశెనగలు, పప్పులు, ఆకుకూరలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు వంటి పదార్థాల్లో అధిక ప్రోటీన్ లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చితే హార్మోన్ సమతుల్యత మెరుగుపడి పిల్లల ఆరోగ్యం బలపడుతుంది. కొన్ని నెలల పాటు ఈ విధమైన ఆహారాన్ని పాటించడం ద్వారా సమస్యలు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుడ్డు, పాలు మాత్రమే కాకుండా వివిధ రకాల పోషకాహారాలను అందించడం ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!