

నిపుణుల ప్రకారం, చాలా మంది భోజనం చేసిన వెంటనే లేదా చేస్తుండగా నీళ్లు తాగుతారు. ఇది జీర్ణవ్యవస్థకు హానికరం. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణ రసాలు బలహీనపడతాయి, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా కడుపులో ఉష్ణోగ్రత తగ్గిపోవడం, భోజనం ఎక్కువసేపు ఉండడం వల్ల బరువు పెరగడం, ఉబ్బరం, ఆమ్లత్వం సమస్యలు కూడా ఎదురవుతాయి.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, భోజనం చేసిన 45 – 60 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగడం మంచిది. భోజనం ముందు నీళ్లు తాగాలంటే 30 నిమిషాల ముందు తాగడం శరీరానికి పోషకాల శోషణలో సహాయపడుతుంది. సరైన సమయంలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది, కడుపు తేలికగా ఉంటుంది, ఊబకాయం, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి, శరీరం పోషకాలను సరిగా గ్రహిస్తుంది, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!