

భారతీయ వంటిళ్లలో వంట నూనె ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, దాని ప్రాముఖ్యతను చాలామంది గుర్తించరు. చాలా సంవత్సరాలుగా నూనెను కేవలం వంటకాల్లో ఉపయోగించే సాధారణ పదార్థంగా మాత్రమే భావిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ, వంట నూనె కూడా మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
నిపుణుల ప్రకారం, చాలా ఇళ్లలో ఇంకా అధికంగా నూనె వాడటం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లు కొనసాగుతున్నాయి. ఒకే రకమైన నూనెను అన్ని వంటకాలకు వాడటం వల్ల శరీరానికి అవసరమైన సమతుల్య ఫ్యాటీ యాసిడ్స్ అందవు. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. డీప్ ఫ్రై, తాలింపు, స్లో కుకింగ్ వంటి వంట విధానాలకు వేర్వేరు నూనెలను ఉపయోగించడం అవసరం.
పూర్వ కాలంలో ప్రాంతానుసారంగా ఆవనూనె, కొబ్బరినూనె, వేరుశెనగ నూనె వాడటం వంటి సంప్రదాయాలు ఉండేవి. ప్రస్తుతం మళ్లీ ఆ సంప్రదాయాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బ్లెండెడ్ ఆయిల్స్ వినియోగం కూడా పెరుగుతోంది, ఇవి శరీరానికి సమతుల్య ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి. కాబట్టి వంట నూనెను అలవాటుగా కాకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయడం ఎంతో అవసరం.
గమనిక: రక్తహీనత తీవ్రంగా ఉన్నవారు స్వయంగా మందులు వాడకుండా ముందుగా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!