

చిన్న వయసులో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాకుండా మెదడులోని ఆకలిని నియంత్రించే హైపోథాలమస్ భాగం కూడా దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఈ వ్యవస్థ దెబ్బతింటే, పెద్దయ్యాక కూడా మెదడు అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెరలున్న ఆహారాన్ని కోరుకునేలా “రూపాంతరం” చెందుతుందని చెబుతున్నారు.
దీని వల్ల భవిష్యత్తులో ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్ ఫైబర్ ఉన్న ఆహారం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆస్పరాగస్ వంటి సహజ ఆహారాలు పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచి జంక్ ఫుడ్ వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!