

సరైన ఆహారం మన శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతే, తప్పు ఆహార ఎంపికలు మనకు అలసటను పెంచుతాయి. నిపుణుల సూచనల ప్రకారం కఠినమైన డైటింగ్ అవసరం లేకుండా, ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే వేసవి వేడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యకరమని భావించే వేయించిన వేరుశెనగలు, మిక్స్‌డ్ నట్స్, పల్లీ చిక్కీలు వంటి ఆహారాలు వేసవిలో జీర్ణానికి భారంగా మారి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వీటికి బదులుగా సబ్జా గింజల పానీయం, నానబెట్టిన బాదం, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు సులభంగా జీర్ణమవుతాయి.
పానీయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బాటిల్ వాటర్, ప్యాక్ జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్‌కి బదులుగా కొబ్బరి నీరు, నిమ్మరసం, బెల్లం ఆధారిత సహజ పానీయాలు తీసుకోవడం ఉత్తమం. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి హైడ్రేషన్‌ను కాపాడతాయి. పండ్ల ఎంపికలో మామిడి, సపోటా, పైనాపిల్ వంటి తీపి పండ్లు శరీర వేడిని పెంచే అవకాశం ఉండగా, పుచ్చకాయ, కర్బూజ, దానిమ్మ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే మసాలాల విషయంలో సోంపు, జీలకర్ర, ధనియాలు వాడటం ద్వారా శరీరం చల్లగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం వంటి చిన్న అలవాట్లు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.


.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!