

మన భారతీయ వంటగదిలో పోపు డబ్బాలో తప్పనిసరిగా ఉండే దినుసులలో బిర్యానీ ఆకు ఒకటి. చాలామంది దీన్ని కేవలం బిర్యానీ, పులావ్‌లలో సువాసన కోసం మాత్రమే వాడుతారని భావిస్తారు. కానీ సాధారణ అన్నం వండేటప్పుడు కూడా బిర్యానీ ఆకును వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు కొందరికి అజీర్తి, కడుపు ఉబ్బరం కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల అందులోని సహజ సమ్మేళనాలు జీర్ణక్రియను సులభతరం చేసి గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి.
బిర్యానీ ఆకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, ఐరన్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే అన్నంలో దీన్ని చేర్చడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇందులోని రుటిన్, కెఫిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి రక్తనాళాలను బలోపేతం చేస్తాయి. అదనంగా, ఇందులోని సుగంధ తైలాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!