

గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్ A, D, E, ఐరన్, జింక్ వంటి కీలక పోషకాలతో నిండిన చౌకైన మరియు అందుబాటులో ఉండే అద్భుత ఆహారం. సుమారు 50 గ్రాముల గుడ్డు 77–80 కిలోకేలరీల శక్తిని, 6.3 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. గుడ్డు తెల్లసొనలో కొవ్వు లేకపోయినా, పచ్చసొనలో శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ మరియు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ల్యూటిన్, జియాజాంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కోలిన్ మెదడు అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం.
గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను బలపరచడంలో, జుట్టు మరియు గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చసొన హానికరం అనే అపోహలకు వైద్యులు ఖండన తెలిపారు; ఇది మంచి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆరు నెలల శిశువుల నుండి వృద్ధుల వరకు ఎవరైనా గుడ్డును తినవచ్చు. కిడ్నీ సమస్యలు, జాండిస్, డెంగ్యూ వంటి సందర్భాల్లో కూడా గుడ్డు తెల్లసొన సురక్షితం. అందుకే గుడ్డును ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!