

వేసవిలో శరీరానికి నీరసం రాకుండా ఉండేందుకు దోసకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 95% నుంచి 96% వరకు నీరు ఉంటుంది కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా దోసకాయ మంచిగా పనిచేస్తుంది.
పుచ్చకాయలో కూడా సుమారు 91% నుంచి 92% నీరు ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ అనే పోషకం చర్మాన్ని సూర్యకిరణాల నుండి రక్షిస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ A, C రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండు ఫలాలు మంచివి. దోసకాయలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. పుచ్చకాయ తక్షణ శక్తిని ఇస్తుంది కానీ డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. రాత్రి కన్నా పగటిపూట పుచ్చకాయ తీసుకోవడం మంచిది.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!