

చాలా మంది మహిళలు, యువతులు పొడవాటి, ఒత్తైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ సరైన జుట్టు సంరక్షణ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, కెమికల్స్ ఉన్న షాంపూలు, హెయిర్ కలర్లు, హెయిర్ డైలు వాడటం వల్ల జుట్టు తీవ్రంగా దెబ్బతింటోంది. దీనివల్ల జుట్టు రాలడం, పలచబడటం, నెమ్మదిగా పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. నిపుణుల ప్రకారం జుట్టు సాధారణంగా నెలకు 1 నుంచి 1.5 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. సరైన పోషకాహారం, క్రమమైన సంరక్షణతోనే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.
గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో వారానికి రెండుసార్లు తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై జుట్టు కుదుళ్లు బలపడతాయి. కలబంద, ఉల్లిపాయ రసం కలిపిన ప్యాక్ జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ వంటి ప్రోటీన్ ఆహారం జుట్టుకు మేలు చేస్తుంది. అతిగా షాంపూ చేయకుండా, హీట్ స్టైలింగ్ పరికరాలు తక్కువగా వాడుతూ, రాత్రి జుట్టును వదులుగా అల్లుకోవడం వల్ల జుట్టు విరగకుండా ఉంటుంది. సహజ పద్ధతుల్లో చేసే సంరక్షణే శాశ్వత అందాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!