

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటినుంచే భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. అధికారిక సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆమె పోలీస్ అధికారి పాత్రలో దర్శనమివ్వనున్నారనే సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఈ వార్త ఎంతవరకు నిజమనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కొరటాల శివ చిత్రాల్లో కథతో పాటు నేపథ్యానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కథ జరిగే ప్రాంతం, అక్కడి ప్రజల జీవన విధానం వంటి అంశాలను ఆయన బలంగా చూపిస్తుంటారు. ఇప్పుడు బాలయ్య బాబుతో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ కథను రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో కథ విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!