

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, వెంకటేష్ దగ్గుబాటి తెలుగులో తెరకెక్కనున్న దృశ్యం 3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మలయాళం, హిందీ వెర్షన్లు మాత్రం ముందుకు సాగుతున్నాయి. అక్కడ మోహన్ లాల్, అజయ్ దేవగన్ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.
తెలుగు వెర్షన్‌కు అడ్డంకులు ఎదురవుతున్నాయనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండటం ఒక కారణమై ఉండొచ్చని రూమర్లు చెబుతున్నాయి. పరిస్థితులు మారకపోతే లేదా కొత్త నటుడు ఎంపిక కాకపోతే, తెలుగులో ‘దృశ్యం 3’ ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం వెంకటేష్ దృష్టి పూర్తిగా ఒరిజినల్ తెలుగు సినిమాలపైనే ఉందని సమాచారం. ఆయన AK47 కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సిద్ధమవుతుండగా, మరో సంక్రాంతి ఎంటర్టైనర్ను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!