

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాలతో విభిన్నమైన కథలను ఎంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం 3 ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. అందులో భరి అనే క్రీడా నేపథ్య చిత్రం ఒకటి. కమిటీ కుర్రోళ్లు సినిమాతో గుర్తింపు పొందిన యదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. గాయం నుంచి వరుణ్ తేజ్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఆయ్ దర్శకుడు అంజి చెప్పిన కథా ఆలోచనకు వరుణ్ తేజ్ నుంచి ప్రాథమిక అంగీకారం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పూర్తి కథనం ఇంకా వినాల్సి ఉందని సమాచారం. ఇక అట్లీ సహాయకుడు బాలాజీతో మరో సినిమా చర్చల్లో ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ 3 సినిమాలు కార్యరూపం దాలిస్తే వరుణ్ తేజ్ కెరీర్‌లో విభిన్నమైన కథలతో కూడిన కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!