
జనరల్

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన యష్ ఈ సినిమాకు సుమారు రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారా అద్వానీకి దాదాపు రూ.15 కోట్లు, నయనతారకు రూ.12–18 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక యువ కథానాయిక రుక్మిణి వసంత్‌కు సుమారు రూ.3–5 కోట్ల పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అగ్ర నటీనటులు భాగం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఈ వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!