

ది ప్యారడైజ్ సినిమా టికెట్ ధరల పెంపుపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలను ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలనేది మొదటి ప్రతిపాదనగా తెలుస్తోంది. రెండో ప్రతిపాదన ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై 50, మల్టీప్లెక్స్‌లలో 75 పెంచే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఇక మూడో ప్రతిపాదనలో మల్టీప్లెక్స్ టికెట్ ధరలను మాత్రమే పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 295గా ఉన్న మల్టీప్లెక్స్ టికెట్ ధరను సుమారు 350కు పెంచే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా ప్రస్తుత ధరలనే కొనసాగించాలనే ప్రతిపాదన ఒకవైపు ఉండగా, మరోవైపు థియేటర్ల వర్గాల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే టికెట్ ధరలపై పూర్తి స్పష్టత రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!