

ధనుష్ నటించాల్సిన 56వ చిత్రం ‘D56’ పారితోషికం చర్చల కారణంగా అనిశ్చితిలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. డాన్ పిక్చర్స్ నిర్మాణంలో తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ధనుష్ పారితోషికానికి సంబంధించిన ఒప్పందంపై నిర్మాతలు, నటుడి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. తొలుత సినిమా లాభాల్లో వాటా కోరిన ధనుష్.. అనంతరం అడ్వాన్స్‌గా రూ.65 కోట్ల ఫ్లాట్ ఫీజును డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి నిర్మాణ సంస్థ అంగీకరించకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు నిర్మాణ సంస్థ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అందకపోవడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. అవసరమైన అనుమతి లేకుండా సినిమాను ధనుష్ సొంతంగా నిర్మించే అవకాశం లేదని సమాచారం. దీంతో ప్రస్తుతం ‘D56’ భవిష్యత్తుపై స్పష్టత లేకపోగా.. ధనుష్ తన తదుపరి హిందీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే పారితోషికం వివాదం, NOC అంశం, ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!