

భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితకథ ఆధారంగా రూపొందనున్న ప్రతిష్ఠాత్మక బయోపిక్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, హీరోయిన్ ఎంపిక అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ పాత్ర కోసం సాయి పల్లవి పేరు బలంగా వినిపించింది. ఆమె సహజ నటన, సాంప్రదాయ పాత్రలకు సరిపోయే వ్యక్తిత్వం కారణంగా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రకు సరైన ఎంపికగా భావించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేక లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో రుక్మిణి వసంత్ పేరు కూడా వినిపించినప్పటికీ, ప్రస్తుతం రష్మిక పేరు ఎక్కువగా చర్చలో ఉంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!