

కేంద్ర ప్రభుత్వం, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా కేంద్రం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్‌ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని, ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. వీటిలో ప్రధాన్ రాజీనామా మినహా మిగతా రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై నిర్ణయం వెల్లడించేందుకు కేంద్రం ఒక రోజు సమయం కోరినట్లు సీజేపీ తెలిపింది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని పార్టీ స్పష్టం చేసింది. తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. దీంతో కేంద్రం తీసుకునే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!