

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన బాక్సాఫీస్ స్టామినాను ప్రదర్శించారు. శంకర్ వరప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ. 400 కోట్ల పైగా కలెక్షన్లు సాధిస్తూ చిరంజీవి కెరీర్లో భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బాబీ కొల్లీ దర్శకత్వంలో రెండో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో చిరంజీవి-బాబీ కొల్లీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించింది. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు తెరకెక్కుతున్న ‘మెగా 158’ పై అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా బెంగాల్ నేపథ్యంతో, పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని టాక్ ఉంది.
ఈ సినిమాకు సంబంధించి ఓ అప్టేట్ చర్చనీయాంశంగా మారింది. అదే మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ (Mohanlal) పాత్రే. తాజా బజ్ ప్రకారం, మోహన్ లాల్ ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. ఇది కేవలం కామియో రోల్ మాత్రమే కాకుండా, కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రగా ఉంటుందని టాక్. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఎవరూ ఊహించని రీతిలో ఉండబోతోందని టాక్. చిరంజీవి- మోహన్ లాల్ వంటి ఇద్దరు లెజెండరీ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా మారనుంది. కథాంశం విషయానికి వస్తే, ‘మెగా 158’లో తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతుందని సమాచారం. చిరంజీవి తన కెరీర్లో తొలిసారి పూర్తిస్థాయి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాల్ని మేళవిస్తూ కథను నడిపించాలని బాబీ కొల్లి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి పేరు వినిపిస్తోంది.చిరంజీవి సరసన ఆమె తొలిసారి నటిస్తుండటంతో ఈ కొత్త జోడీపై ఆసక్తి నెలకొంది. కూతురు పాత్ర కోసం శ్రీలీల, కృతి శెట్టి, అనస్వర రాజన్ వంటి యువ హీరోయిన్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బాలీవుడ్ నటుడు అనురాగ్ కాశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నారని టాక్ కూడా సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, KVN ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకట నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కాకా’ అనే మాస్ టైటిల్ కూడా పరిశీలనలో ఉందని వార్తలు వచ్చాయి. మేకర్స్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘మెగా 158’ కేవలం మరో మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా,చిరంజీవి-మోహన్ లాల్ కలయికతో ఈ సినిమాను డైరెక్టర్ బాబీ పాన్-ఇండియాగా మార్చాలని భావిస్తున్నట్టు, ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్న ప్రాజెక్ట్‌గా మారుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!