
జనరల్

అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ విజయాన్ని అందుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తోంది. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ హీరో ఎవరు అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అలాగే సినిమా చివరి భాగంలో నాగార్జున సూచనల మేరకు కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అఖిల్, భాగ్యశ్రీల మధ్య ప్రేమకథ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, సినిమా ఫలితంపై చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉందని తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!