
రాజకీయాలు

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్‌కు నేపాల్ ఆర్మీ గౌరవ జనరల్ హోదా లభించింది. కాఠ్‌మాండూలోని శీతల్ నివాస్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఈ గౌరవ హోదాను ఆయనకు ప్రదానం చేశారు. భారత్-నేపాల్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సైనిక సంబంధాలకు ఈ గౌరవం ప్రతీకగా నిలిచింది. భారత ప్రభుత్వం కూడా జనరల్ సేథ్‌ను 2026 జూన్ 30న 31వ ఆర్మీ చీఫ్‌గా నియమించింది.
నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ ఆహ్వానం మేరకు జనరల్ సేథ్ ఆగస్టు 17 నుంచి 19 వరకు నేపాల్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారం, ద్వైపాక్షిక రక్షణ సంబంధాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!