

మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసాన్ని పురస్కరించుకుని కేరళలోని శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూలైన్ల ద్వారా భక్తులను కొండపైకి అనుమతించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ప్రధాన పూజారి కందరారు బ్రహ్మదత్తన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. 2026లో చింగం మాసపు నెలవారీ పూజలు ఆగస్టు 16 నుంచి 21 వరకు కొనసాగనున్నాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు దర్శన ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ సదుపాయంతో పాటు భక్తుల రాకపోకలకు కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చింగం మాసపు పూజలు ముగిసిన అనంతరం ఓనం వేడుకల కోసం ఆగస్టు 24న ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. ఓనం ఉత్సవాల కోసం ఆలయం ఆగస్టు 24 నుంచి 28 వరకు తెరిచి ఉంటుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!