

నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో స్పిరిట్ కథ ప్రధానంగా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగుతుందని చెప్పడంతో ఈ చర్చ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ను హైదరాబాద్ వ్యక్తిగా చూపిస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని అభిమానులు సందేహిస్తున్నారు. అయితే కథ జరిగే ప్రాంతం కంటే సందీప్ రెడ్డి వంగా మార్క్ డ్రామా, పాత్రల రూపకల్పనే సినిమాకు అసలు బలమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యానిమల్‌ను కూడా ఒకే నగర నేపథ్యంతో తెరకెక్కించినా దేశవ్యాప్తంగా భారీ ప్రభావం చూపించారు. అందుకే స్పిరిట్ విషయంలోనూ ప్రాంతం పెద్ద అడ్డంకి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పాత్రను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏ స్థాయిలో తీర్చిదిద్దారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కథకు హైదరాబాద్ నేపథ్యం ఉండటం వల్ల సినిమా పరిధి తగ్గిపోదని అభిమానులు భావిస్తున్నారు. కథనం, పాత్రల తీరు, యాక్షన్ అంశాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండనుందని చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!