
జనరల్

ఫహాద్ ఫాసిల్ తెలుగు సినిమాలో విలన్ మరియు కీలక పాత్రల కోసం అత్యధికంగా కోరబడుతున్న నటులలో ఒకరిగా మారారు. ఒకప్పుడు విజయ్ సేతుపతి ఈ స్థాయిలో డిమాండ్‌లో ఉండగా, ఇప్పుడు ఫహాద్ ఫాసిల్‌కు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఆయన ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ ఎంచుకుంటున్నారని సమాచారం. పుష్ప 2 తర్వాత ఆయన పాత్ర ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, పాత్రకు ప్రాధాన్యం మరియు రెమ్యునరేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్ ఉంది.
తాజా సమాచారం ప్రకారం రామ్ పోతినేని నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్‌లో ఒక కీలక పాత్ర కోసం ఆయనను సంప్రదించినా, ఫహాద్ ఫాసిల్ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!