

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రేజ్ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరవై ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఆయన, ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. తాజాగా సల్మాన్ ఖాన్ టాలీవుడ్‌పై దృష్టి పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ పెట్టుబడితో ఓ మెగా ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారని సినీ, వ్యాపార వర్గాల్లో చర్చ మొదలైంది.
సోషల్ మీడియా కథనాల ప్రకారం, సల్మాన్ ఖాన్ సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల విస్తీర్ణంలో భారీ టౌన్‌షిప్‌తో పాటు అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలు నిర్మించాలనుకుంటున్నారట. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేపట్టే అవకాశం ఉందని సమాచారం. లగ్జరీ ఇళ్లు, కమర్షియల్ ఏరియాలు, గ్రీన్ స్పేస్‌లతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, డిజిటల్ కంటెంట్ కోసం అన్ని సౌకర్యాలు కలిగిన హైటెక్ స్టూడియోలు కూడా ఇందులో ఉండనున్నాయని టాక్.
ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ వంటి పెద్ద ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు ఉన్న హైదరాబాద్‌కు ఈ ప్రాజెక్ట్ మరో మైలురాయిగా మారవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడంతో పాటు రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ రంగాలకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలే కాగా, సల్మాన్ ఖాన్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!