7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

Writer: Pooja 02:12 PM, 7 నవంబర్, 2026
‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన రామాయణ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 5న విడుదలైన ఈ విజువల్ వండర్.. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు అందుబాటులో ఉన్న వసూళ్ల గణాంకాలు చెబుతున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్లు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తొలి రోజు భారత్‌లో రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే శుక్రవారం వర్కింగ్ డే కావడంతో రెండో రోజు కలెక్షన్లలో 25.9 శాతం తగ్గుదల నమోదైంది. ఆ రోజు రూ.48.05 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో దేశీయంగా నెట్ కలెక్షన్లు రూ.112.90 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు రూ.134.80 కోట్లుగా నమోదయ్యాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ రామాయణ మంచి వసూళ్లు సాధిస్తోంది. రెండో రోజు విదేశాల్లో రూ.35 కోట్ల గ్రాస్ రాబట్టడంతో, రెండు రోజుల్లో అక్కడి మొత్తం వసూళ్లు రూ.86.25 కోట్లకు చేరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.221.05 కోట్లుగా నమోదైనట్లు సమాచారం. కన్నడ వెర్షన్‌కు థియేటర్లలో అత్యధిక ఆక్యుపెన్సీ లభించింది. రెండో రోజు హిందీ వెర్షన్ రూ.35.50 కోట్లతో ముందంజలో నిలవగా, కన్నడలో రూ.5.15 కోట్లు, తెలుగులో రూ.4.75 కోట్లు, తమిళంలో రూ.1.50 కోట్లు, మలయాళంలో రూ.1.15 కోట్ల వసూళ్లు వచ్చాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 23,316 షోల ద్వారా ఈ కలెక్షన్లు నమోదయ్యాయి. తొలి రెండు రోజుల్లో 43 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో రూ.215.78 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లు సాధించిన ఆదిపురుష్ రికార్డును కూడా రామాయణ అధిగమించినట్లు సమాచారం. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రెండు భాగాల చిత్రానికి కలిపి సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం సీతాపహరణం, జటాయువు మరణం, రాముడి ప్రతిజ్ఞతో ముగియడంతో రెండో భాగంపై ఆసక్తి పెరిగింది. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగితే సినిమా మరో భారీ మైలురాయిని చేరే అవకాశం ఉంది. తొలి వారంలోనే రూ.500 కోట్ల మార్కును అందుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

విదేశీ వసూళ్లలో దక్షిణాది సినిమాల జోరు?

విదేశీ వసూళ్లలో దక్షిణాది సినిమాల జోరు?

రాకా విడుదల..ఇంత ఆలస్యమా?

రాకా విడుదల..ఇంత ఆలస్యమా?

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?

షారుక్ రికార్డుని సమం చేసిన యష్?

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?

ఆకట్టుకున్న సూర్య విభిన్న ప్రయోగం?

శ్రీరాముడిగా మహేష్ బాబుపైనే అందరి దృష్టి?

శ్రీరాముడిగా మహేష్ బాబుపైనే అందరి దృష్టి?

ట్యాగ్లు
రామాయణ సినిమారణ్‌బీర్ కపూర్సాయిపల్లవియష్బాక్సాఫీస్ వసూళ్లుభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా
జనరల్

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు
బిజినెస్

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
గాసిప్స్

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు
జనరల్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం
సినిమాలు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’
సినిమాలు

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ
క్రీడలు

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ

హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ
జనరల్

హైదరాబాద్ మూసీ ప్రాజెక్టుపై గ్లోబల్ పోటీ

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్
క్రీడలు

భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు
షోస్

ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..డేంజర్‌లో నలుగురు

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి
షోస్

ముకేష్ కోసం తన అవకాశాన్ని త్యాగం చేసిన వర్షిణి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!