

రామ్ చరణ్, సుకుమార్ కలయికలో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం ఆర్సీ 17పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, ఇప్పుడు సంగీత దర్శకుడి విషయంలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి తొలుత దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు భావించినప్పటికీ, ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 నేపథ్య సంగీతం సమయంలో ఏర్పడిన కొన్ని సృజనాత్మక భేదాభిప్రాయాలే ఈ మార్పుకు కారణమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడి కోసం సుకుమార్ పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన శాశ్వత్ సచ్‌దేవ్‌తో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్, సాయి అభ్యంకర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అయితే ఈ అంశంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. త్వరలోనే చిత్రబృందం ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటివరకు ఈ మార్పుపై వస్తున్న కథనాలు చర్చగానే మిగిలే అవకాశముంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!