

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటిగా నిలుస్తోంది. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండగా సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్ర హిందీ థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు రూ.450 కోట్ల ధర కోరుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భారీ మొత్తంతో పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనిల్ తడాని, జయంతిలాల్ గడ, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు ఆసక్తి చూపించినప్పటికీ డీల్ ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉండగా, భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!