

నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ ఇప్పుడు అంతర్జాతీయ దిశగా అడుగులు వేస్తోందనే చర్చలు టాలీవుడ్లో జోరుగా సాగుతున్నాయి. కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఇప్పుడు అమెజాన్ MGM స్టూడియోస్ తో కలిసి ఓ ఆసక్తికరమైన గ్లోబల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విదేశీ ప్రొడక్షన్ టీమ్‌తో కలిసి కనిపించిన నిఖిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ ప్రాజెక్ట్ సినిమా రూపంలో వస్తుందా, వెబ్ సిరీస్‌గా రూపొందుతుందా లేదా ప్రత్యేక అంతర్జాతీయ కంటెంట్‌గా తెరకెక్కుతుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మే 15న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు హీరోలు గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో నిఖిల్ కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధమవడం విశేషంగా మారింది. కంటెంట్ ఆధారిత చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, ఈసారి అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!