

రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రం ఆగస్టు 21, 2026న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, అదే తేదీకి షెడ్యూల్ అయిన ది పారడైజ్ భవితవ్యంపై కొత్త చర్చ మొదలైంది. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట మార్చి 26, 2026న విడుదల కావాల్సి ఉండగా, అనంతరం ఆగస్టుకు వాయిదా పడింది. ఇప్పుడు ఇరుముడి అదే తేదీని ఖరారు చేయడంతో ది పారడైజ్ మళ్లీ వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా షూటింగ్‌లో ఇంకా గణనీయమైన భాగం మిగిలి ఉందన్న ప్రచారం జరుగుతుండగా, చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఫస్ట్ గ్లింప్స్, “ఆయా షేర్” పాట తర్వాత పెద్దగా అప్‌డేట్లు లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 2026కు వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!