

‘కేజీఎఫ్’ సినిమాలతో యశ్ సంపాదించుకున్న క్రేజ్ ‘టాక్సిక్’తో తగ్గిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆయన తల్లి పుష్ప స్పందించారు. గతంలో నిర్మాత అల్లు అరవింద్ ‘కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎవరు?’ అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో, యశ్ ఏదో సాధారణ వ్యక్తి కాదని, స్టార్ హీరో అని ఆమె ఘాటుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సినీ నేపథ్యం, పెద్ద ఆర్థిక అండ లేకుండా తన సొంత కష్టంతో కొడుకు ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు.
యశ్ ‘కేజీఎఫ్’కు ముందే కన్నడ చిత్రసీమలో వరుస విజయాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారని పుష్ప పేర్కొన్నట్లు సమాచారం. ‘కేజీఎఫ్’కు ముందు యశ్ ఎవరు? అని ప్రశ్నించే వారికి ఆయన గత విజయాలే సమాధానమని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, యశ్‌పై విమర్శలు చేస్తున్న వారితో పాటు అల్లు అరవింద్ గత వ్యాఖ్యలకు కూడా ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. యశ్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!