
జనరల్

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న విడాకుల రూమర్లు అభిమానుల్లో చర్చకు దారి తీశాయి. భర్త సూరజ్ నంబియార్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల ప్రచారం మరింత ఊపందుకుంది.
ఈ రూమర్లపై మౌనీ రాయ్ ఘాటుగా స్పందిస్తూ అసత్య కథనాలు ప్రచారం చేయవద్దని మీడియాను కోరింది. 2022లో గోవాలో సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్న మౌనీ, ప్రస్తుతం సినిమాలు మరియు ప్రత్యేక గీతాలతో బిజీగా ఉంది. అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!