

‘రాజాసాబ్’ సినిమా ఫలితం నుంచి దర్శకుడు మారుతి ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నారు. ఆ సినిమా పరాజయానికి పలు కారణాలు ఉన్నప్పటికీ, విమర్శలు ఎక్కువగా ఆయనపైనే పడ్డాయి. ప్రస్తుతం ఆయన కొత్త కథపై దృష్టి పెట్టారు. కేరళలో ప్రశాంతంగా ఉండి, తన వద్ద ఉన్న ఓ కథను పూర్తి స్క్రిప్ట్‌గా మార్చి సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ కొత్త సినిమాకు హీరోగా ఎవరిని తీసుకుంటారనే విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే రామ్ పోతినేని మరియు వరుణ్ తేజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముంది. గతంలో మైత్రీ బ్యానర్లో మారుతి సినిమా ఫైనల్ కాలేకపోయినా, ఈసారి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
ప్రస్తుతం రామ్ చేతిలో కొత్త సినిమా లేదు. ఆయన రెండు కథలపై పని చేస్తున్నారు. అవి కాకపోతే మారుతి కథతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు వరుణ్ తేజ్ ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. కథ విన్న తర్వాతే హీరో ఎవరన్నది తేలనుంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!