

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం సాధించిన ఘన విజయంతో ఇప్పుడు ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మరోసారి యాక్షన్, స్టైల్, ఎమోషన్ మేళవించిన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మొదట ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక చవితి సెలవులను లక్ష్యంగా చేసుకుని సెప్టెంబర్ 10 లేదా 11 తేదీల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్ రవిచందర్ కలయిక మరోసారి బ్లాక్‌బస్టర్ మ్యాజిక్ సృష్టిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జె.సూర్య, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!