

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సింగ్ గీతం సినిమా ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ నిర్మాణ సహకారంతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌ను బట్టి చూస్తే, సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేకమైన సృజనాత్మకత, వినూత్న కథనం, వినోదంతో నిండిన చిత్రంగా ఇది ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని అందించబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో భారీ ట్విస్ట్ దాగి ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కథలోని కీలక మలుపును మేకర్స్ పూర్తిగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. థియేటర్లలో ఆ ట్విస్ట్ బయటపడిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రహస్య అంశమే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవొచ్చని భావిస్తున్నారు. దీంతో ‘సింగ్ గీతం’పై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!