
జనరల్

పీఎం-కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నిధులు జమ చేయనున్నారు. ఈ పథకం 24వ విడతలో భాగంగా మొత్తం రూ.18,690 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. గుజరాత్‌లోని బనస్కాంతలో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు.
మధ్యప్రదేశ్‌లోని రైసన్ నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే సందర్భంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద ఏర్పాటు చేసిన 521 యూనిట్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ప్రాధాన్యం ఇవ్వనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!