

తమిళనాడులోని పాంబన్ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన డ్రోన్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. సుమారు 43 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పాంబన్ బ్రిడ్జి అందాలు, దానిపై ప్రయాణిస్తున్న రైలు, కింద నుంచి పడవలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ వ్యవస్థ కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతంతో పాటు సముద్రపు అందాలు ఆకట్టుకునేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.
కొత్త పాంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ గతేడాది ప్రారంభించారు. దేశంలోని ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నౌకలు, పడవలు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జిలో ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ వ్యవస్థ దీని ప్రత్యేకత. ఇదిలా ఉండగా, పాత పాంబన్ వంతెనలోని లిఫ్ట్ భాగాలను ఇటీవల తొలగించారు. ప్రస్తుతం ప్రధాని పంచుకున్న కొత్త బ్రిడ్జి వీడియో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!