

శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమా విడుదలపై మరోసారి సందిగ్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణంలో, రా అండ్ రస్టిక్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్న ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలతో పాటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా వాయిదా వేశారు. అప్పటి నుంచి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండటంతో, అనుకున్న తేదీకి థియేటర్లలోకి వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు, వరుసగా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, రామాయణ ప్రభావం కూడా కొనసాగుతోంది. భోగిపై ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం సవాలుగా మారే అవకాశం ఉంది.
సినిమా విడుదల తేదీపై నిర్మాతలు, దర్శకుడు ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలేజ్ యాక్షన్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఆదుకలం నరేన్, రోహిత్ పాఠక్, రవివర్మ కీలక సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్, ఇన్వేట్ మీడియా, శ్రీ తెనాండల్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అనే విషయంపై అధికారిక స్పష్టత కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!