

అక్కినేని అఖిల్ కెరీర్‌లో విజయాలు రావడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. అందులో ముఖ్యమైనది భారీ అంచనాలు. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు యూనిట్ నియంత్రించలేకపోయినా, అంచనాలను తగ్గించడం మాత్రం వారి చేతిలోనే ఉంటుంది. కానీ అఖిల్ సినిమాల విషయంలో ఇది సరిగా జరుగడం లేదనే అభిప్రాయం ఉంది.
ప్రతి సినిమా ప్రారంభం కావడంతోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలవుతుంది. సినిమా గొప్పగా ఉందని, హీరో లుక్ అద్భుతంగా ఉందని వంటి లీక్స్ బయటకు వస్తుంటాయి. ఈ ఓవర్ హైప్ వల్ల గతంలో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా విషయంలో ఇదే పరిస్థితి కనిపించింది.
ఇప్పుడు అఖిల్ కొత్త సినిమా ‘లెనిన్’కి కూడా ఇదే తరహా హైప్ పెరుగుతోంది. హిట్స్ లేని హీరో, పైగా కెరీర్‌లో గ్యాప్ ఉన్న సమయంలో, సినిమా కంటెంట్ మీదే దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈ విధమైన హైప్ సినిమా మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!