

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయనే ప్రచారం జోరందుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’ సంక్రాంతికి విడుదలవుతుందని గతంలో వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ సినిమాను 2027 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఈ తేదీని ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ కోసం కేటాయించినట్లు సమాచారం. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా మాత్రం ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 13న విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే, ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల తేదీ కూడా మారవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న విడుదల చేయాలని పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే తేదీన మహేశ్‌బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ విడుదల కానుందని గతంలో ప్రకటించారు. దీంతో టాలీవుడ్ భారీ చిత్రాల రిలీజ్ క్యాలెండర్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ‘విశ్వంభర’, ‘కాకా’, ‘ఫౌజీ’, ‘వారణాసి’ చిత్రాల విడుదల తేదీల మార్పులపై ఆయా చిత్ర బృందాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!