

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రమైన ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో జక్కన్న చాలా మైక్రో డీటెయిల్స్ దాచినట్లు అభిమానులు గుర్తిస్తున్నారు.
44వ సెకనులో అంటార్కిటికాలోని మంచు ప్రాంతంలో ఒక ఉల్క పడే సన్నివేశం కనిపిస్తుంది. ఆ పర్వతం వెనుక నీటిమీద చిన్న పడవలో కొందరు కనిపించడం, అక్కడ ఏదో రహస్యానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సూచిస్తోంది.
దాని తర్వాత 1 నిమిషం 01 సెకనులో మంచులో ఇరుక్కుపోయిన రెండు ముక్కల పడవ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అదే విధంగా ప్యారాచూట్లో దిగుతున్న షాట్ స్పష్టంగా గమనించవచ్చు.
1 నిమిషం 14 సెకనులో నీటిలో ఈదుతున్న నీటి ఏనుగుల సమూహం, కొంత దూరంలో చేపలు పడుతున్న వ్యక్తులు కనిపిస్తారు. ఈ సన్నివేశం, ఉగ్రబట్టి గుహలో విడుదల చేసిన ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్కు లింక్ ఉన్నట్లు అనిపిస్తుంది.
ఒక ఫ్రేమ్‌లో గన్స్ పట్టుకున్న కొందరు కింద కనిపిస్తారు. పై భాగంలో కొండ అంచున నిలబడి ఉన్న ఆకృతి మహేష్ బాబేనని చాలా మంది భావిస్తున్నారు.
ఇంకా గమనిస్తే—ఒక ముని హోమం ముందు యాగం చేస్తూ, పక్కన కపాలాలు ఉంచినట్లు కనిపిస్తాయి.
తరువాత లంకా నగరానికి సంబంధించిన విజువల్స్‌లో హనుమంతుని తోకపై గుర్రపు బండి, అలాగే ఆయన చెయ్యిలో తీగతో సహా పెద్ద వృక్షం పట్టుకుని యుద్ధం చేస్తున్న విజువల్ కనిపిస్తుంది.
వానర సైన్యం, రామునిపై చూపించిన సన్నివేశంలో వెనుక ఉన్న పర్వతాలు అన్నీ ఒకే ఆకారంలో కనిపించడం ప్రత్యేకమైన డీటెయిల్.
రామబాణం నుంచి వచ్చే నీలి ఎనర్జీ ట్రాన్సిషన్‌తో కథ మళ్లీ ప్రస్తుత వారణాసికి మారుతుంది. ఈ మెరుపు సమయంలో నీటి సుడిగుండం పైగా చక్రాల్లా తిరుగుతున్న ఆకారాలు కనిపించడం—ఇది టైమ్ ట్రావెల్ పోర్టల్ అయి ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.
మొత్తానికి, ఈ గ్లింప్స్‌లో దాగి ఉన్న ఎన్నో వివరాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జక్కన్న ఇంకా ఏ సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడో చూడాలి.











కామెంట్స్ (2)
We can't guess too much until the movie release that's Rajamouli..
Rajamouli’s detailing in every frame is insane