

‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమిత బైజు ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. తక్కువ సమయంలోనే పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంది. ఇటీవల ఆమె నటించిన మూడు చిత్రాలు వరుసగా విడుదల కాగా, వాటిలో రెండు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో విడుదలైన ‘జన నాయగన్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, మమిత బైజు నటనకు ప్రశంసలు లభించాయి. అనంతరం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో అల్లరిపిల్లగా ఆకట్టుకుని విజయాన్ని అందుకుంది. మలయాళంలో నివిన్ పౌలీతో కలిసి నటించిన ‘బెత్లెహెమ్ కుడుంబ యూనిట్’ రూ.174 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ చిత్రాన్ని ఈ నెల 4న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ పేరుతో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరుస విజయాలు, పెరుగుతున్న క్రేజ్ కారణంగా మమిత బైజు తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమెకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే స్థాయిలో విజయాలు కొనసాగితే భవిష్యత్తులో ఆమె పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!