

‘సామజవరగమన’తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. సరికొత్త కథాంశంతో పాటు వినోదానికి పెద్దపీట వేస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. పండుగ సీజన్‌లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
‘సామజవరగమన’కు కథ, మాటలు అందించిన భాను భోగవరపు, నందు ఈ చిత్రానికి కూడా కథ, మాటలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2027 సంక్రాంతి రేసులో పలు క్రేజీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీవిష్ణు సినిమా కూడా బరిలోకి దిగితే పండుగ బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. కామెడీ ప్రధానంగా సాగే కథ కావడంతో సంక్రాంతి సీజన్‌కు ఈ చిత్రం మంచి ఎంపిక అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!