

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్ తరుణ్, శివాజీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కూర్మావతార్’పై అంచనాలు పెరుగుతున్నాయి. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్‌ను పూజిత కె, నరేంద్ర కొండ, సెవితా రావు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మానవుడిలోనే విష్ణువు ఉన్నాడనే భావనను ఆధారంగా చేసుకుని కథను రూపొందించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. రాక్షస శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కూర్మావతారం మానవ రూపంలో ఎలా అవతరిస్తుందనే అంశం కథలో కీలకంగా కనిపిస్తోంది. సాయికుమార్ వాయిస్ ఓవర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శివ రాజ్‌కుమార్ యోగి, కూర్మావతారం మానవ రూపంలో కనిపించే పాత్రలో ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలపరిచింది. అత్యున్నత దృశ్య ప్రభావాలు, భారీ నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్ తరుణ్, శివాజీల పాత్రలకు విభిన్నమైన ఛాయలు ఉన్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. భక్తి అంశాలను థ్రిల్లింగ్ కథనంతో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించేలా కనిపిస్తోంది. కాన్సెప్ట్, విజువల్స్, నేపథ్య సంగీతం కలిసి సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!