

వైవిధ్యమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ధనుష్ తన కెరీర్లో మరో భారీ అవకాశాన్ని అందుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ఆయన హీరోగా నటించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం మొదట రామ్ చరణ్‌ను సంప్రదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం ధనుష్‌కు దక్కినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. మైథలాజికల్ టచ్‌తో కూడిన జంగిల్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉండబోతోందని టాక్. భన్సాలీ స్టైల్‌కు తగ్గట్టుగా భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్‌తో సినిమా రూపొందే అవకాశముంది. ఇప్పటికే హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన ధనుష్‌కు ఇది కీలక మైలురాయిగా నిలవవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!