

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య అనుకోకుండా గాయపడటంతో వైద్యుల సూచన మేరకు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆగస్టు చివరి వారంలో ప్రారంభించాలనుకున్న కీలక షెడ్యూల్ వాయిదా పడింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ నాలుగో వారంలో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా బాలకృష్ణ లేని సన్నివేశాలను చిత్రీకరించి, ఆ తర్వాత ఆయన పాల్గొనే సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో బాలయ్యను కొరటాల శివ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా కథలో కీలక స్థానం ఉంటుందని సమాచారం. కథను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు కొరటాల శివ ఎంతో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్, ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!