

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ఇంకా మూడు నెలలకు పైగా సమయం ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విస్తృతంగా ఉండటంతో విడుదల తేదీని ప్రకటించడంలో మేకర్స్ ఎలాంటి తొందర చూపడం లేదు. అలాగే దీపికా పదుకొనే సన్నివేశాలను ముందుగానే పూర్తి చేస్తున్నారని, షారుఖ్ ఖాన్ క్యామియోపై వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం.
మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23పై కూడా పలు రూమర్లు వైరల్ అవుతున్నాయి. అయితే షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు నిజం కాదని, పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికయ్యారనే ప్రచారంలో కూడా వాస్తవం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ 'డీసీ' ప్రమోషన్లలో బిజీగా ఉండగా, అవి పూర్తైన తర్వాత AA23 పనులు పూర్తి స్థాయిలో వేగం అందుకోనున్నాయని టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!