

‘దసరా’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవితో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో.. తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓదెల తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే చిరంజీవితో చేయబోయే సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు నాని బిజీ షెడ్యూల్, ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌కు అదనపు సమయం పడుతుండటంతో తదుపరి ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘హిట్ 4’ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’పై దృష్టి పెట్టిన ఓదెల.. ఆ తర్వాత చిరంజీవి సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే షూటింగ్ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!