

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా చిత్రానికి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని సినిమా కథతో పాటు తన ప్రత్యేకమైన జడల లుక్ వెనుక ఉన్న రిస్క్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
శ్రీకాంత్ ఓదెల ఈ హెయిర్‌స్టైల్‌ను సూచించినప్పుడు కథకు బలమైన కారణం ఉన్నప్పటికీ తొలుత తాను ఆలోచించానని నాని చెప్పారు. లుక్ కాస్త తేడా వచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్‌కు గురయ్యే అవకాశం ఉందని భయపడ్డానన్నారు. అయితే ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో తర్వాత ప్రేక్షకుల స్పందన తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. అభిమానులు రీల్స్ చేయడం, ఏఐ ద్వారా తమ అభిమాన హీరోలకు ఇలాంటి జడల లుక్‌ను సృష్టించడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రస్తుత కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ది ప్యారడైజ్‌లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, పాత్రల బాధ, ప్రేమ, సంఘర్షణ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయని నాని తెలిపారు. ఈ సినిమా కోసం ఇతర ప్రాజెక్టుల కంటే ఎక్కువ కాల్షీట్లు, శ్రమ కేటాయించానని, ఔట్‌పుట్ చూసిన తర్వాత తన నిర్ణయం సరైనదేనని అనిపించిందన్నారు. కయదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!