
సినిమాలు

నాచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం ది ప్యారడైజ్ ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి థియేటర్‌లో చూడాలని కోరుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా వేదికగా నాని అభ్యర్థించారు.
తాను ఒక సినిమా అభిమానిగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూడాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపారు. అదే సమయంలో అవసరమైన ప్రోటోకాల్స్, భద్రతా మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తామని స్పష్టం చేశారు. నాని చేసిన ఈ అభ్యర్థనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!