

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సిరీస్‌తో ఆయన పేరు పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, పుష్ప 2 తర్వాత ఏకంగా గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ప్రస్తుతం కెరీర్ పీక్ ఫేజ్‌లో ఉన్న బన్నీ, అట్లీ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి సిద్ధమవుతున్న సమయంలో, బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ క్రేజీ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో అల్లు అర్జున్ సినిమా అన్న టాక్. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, ధురంధర్ వంటి బ్లాక్బస్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్, తన తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. ఇటీవల విడుదలైన ధురంధర్ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
ఇప్పటికే ధురంధర్ 2 ప్లానింగ్‌లో ఉన్న ఆదిత్య ధర్, ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు స్టోరీ నేరేషన్ జరిగిందని, ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఆదిత్య ధర్ తొలుత అశ్వత్థామ పాత్ర చుట్టూ ఓ భారీ మైథాలజికల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేసినప్పటికీ, కల్కి 2898 ADలో అదే పాత్ర కీలకంగా ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారని టాక్. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇది పూర్తిగా కొత్త కథతో, మైథాలజీకి భిన్నంగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో రూపొందే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పుష్ప ఫ్రాంచైజీతో 1000 కోట్ల క్లబ్లో రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం AA22, AA23 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా బన్నీ సినిమా చర్చల దశలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్‌తో సినిమా నిజమైతే, అది అల్లు అర్జున్ కెరీర్లో మూడో 1000 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా మారే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ధురంధర్ 2 విడుదల తర్వాతే ఈ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!